గురువారం 26 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 02:53:12

అల్‌ఖైదా నంబర్‌ 2 మస్రీ హతం

అల్‌ఖైదా నంబర్‌ 2 మస్రీ హతం

వాషింగ్టన్‌: అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో నంబర్‌ 2గా ఉన్న అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు మహమ్మద్‌ అల్‌ మస్రీని ఇజ్రాయెల్‌ ఏజెంట్లు మట్టుబెట్టినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఆగస్టు 7న ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో అతడిని హతమార్చినట్టు నిఘా అధికారులను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అల్‌ఖైదా అధిపతిగా ఉన్న అయ్‌మన్‌ అల్‌ జవహరి తరువాత మస్రీనే పగ్గాలు చేపడుతారని భావించారు.