సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Feb 04, 2020 , 00:39:43

సిరియా వైమానిక దాడుల్లో 14 మంది మృతి!

సిరియా వైమానిక దాడుల్లో 14 మంది మృతి!

సర్మీన్‌: రష్యా మద్దతుతో సిరియా వైమానిక దళాలు ఇడ్లిబ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని రెండు సార్లు జరిపిన వైమానిక దాడుల్లో ఆదివారం 14 మంది పౌరులు మరణించారు. సర్మీన్‌ పట్టణంలో జరిగిన బాంబుల దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో దాడిలో ఆరుగురు పౌరులు మరణించారని మానవ హక్కుల సంస్థ తెలిపింది. సిరియా ప్రభుత్వ అనుకూల దళాల దాడుల నేపథ్యంలో వేల మంది తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. 
logo