శుక్రవారం 29 మే 2020
International - Mar 29, 2020 , 19:35:49

మ‌నీలా విమానాశ్ర‌యంలో కూలిన విమానం

మ‌నీలా విమానాశ్ర‌యంలో కూలిన విమానం

హైద‌రాబాద్‌: పిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నిలాలో విమానం కూలింది. నియోయ్ అక్వినో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  వైద్య ప‌రిక‌రాల‌తో వెళ్తున్న విమానం ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలుస్తోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణ‌న‌ష్టం గురించి స‌మాచారం లేదు. పిలిప్పీన్స్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ విమానంలో వైద్య ప‌రికాలు తీసుకువెళ్తున్న‌ది. టేకాఫ్ స‌మ‌యంలో విమానంలో మంట‌లు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 8 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.  జ‌పాన్‌కు పేషెంట్ల‌ను త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు.

 logo