బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 12:24:03

మాస్క్‌లో బంగారం.. అడ్డంగా దొరికిపోయాడు!

మాస్క్‌లో బంగారం.. అడ్డంగా దొరికిపోయాడు!

సాధార‌ణంగా డ్ర‌గ్స్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వాటిని రావాణా చేయ‌డానికి స్మ‌గ్ల‌ర్స్ కొత్త కొత్త దారులు వెతుకుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు వీడొక్క‌డే సినిమాలో హీరో సూర్య ఎవ‌రూ క‌నిపెట్ట‌లేని విధంగా స్మ‌గ్లింగ్ చేస్తారు. ఆ త‌ర‌హాలో ఇత‌ను బంగారాన్ని ఎవ‌రికంటా ప‌డ‌కుండా ఉండేందుకు ఏకంగా మాస్క్‌లోనే దాచేశాడు. కానీ ఏం చేస్తాం. క‌ర్మ అత‌ని త‌ల‌మీదే తిరుగుతున్న‌ట్లుంది అడ్డంగా దొరికిపోయాడు. కాలికట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌ను లోప‌లికి వెళ్లేట‌ప్పుడు అత‌నితో పాటు పెట్టుకున్న N-95 మాస్క్‌ను కూడా చెక్ చేశారు. అందులో చూస్తే 40 గ్రా. బంగారంతో దొరికిపోయాడు. పాపం మాస్కా్‌ని ఎవ‌రు చూస్తారులే అనుకున్నాడు.


logo