శనివారం 06 జూన్ 2020
International - May 22, 2020 , 17:04:52

ఇండ్లపై కుప్పకూలిన విమానం... వీడియో

ఇండ్లపై కుప్పకూలిన విమానం... వీడియో

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచి విమానాశ్రయం వద్ద పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్‌ నుంచి కరాచీకి వచ్చిన విమానం.. ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందే కూలిపోయింది. కూలిన విమానం  పీకే-303గా అధికారులు నిర్ధారించారు. జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్‌ కాలనీలోని ఇండ్లపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కూలిన దృశ్యాలు... వీడియో..



logo