గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 12, 2020 , 18:55:23

అమెరికన్‌ గాయనినోట ‘ఓం జై జగదీష హరే’!

అమెరికన్‌ గాయనినోట ‘ఓం జై జగదీష హరే’!

న్యూయార్క్‌: దీపావళి పండుగను పురస్కరించుకొని మన దేశంలో ఎక్కువగా పాడుకునే భక్తి శ్లోకం 'ఓం జై జగదీష హరే'ను ఓ అమెరికన్ గాయని పాడారు. అమెరికన్‌ గాయని, నటి మేరీ మిల్బెన్ సంప్రదాయ వస్త్రధారణలో ఈ పాట షూట్‌లో పాల్గొన్నారు. ఈ మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఆరెంజ్, పింక్ లెహెంగా, దానిపై అందమైన ఆభరణాలతో భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మిల్బెన్‌ అలంకరించుకున్నారు. నుదిటిపై టిక్లీ పెట్టుకున్నారు. సంగీతానికి అనుగుణంగా హావభావాలు పలికించారు. మిల్బెన్‌ ఈ వీడియోను మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో పెట్టారు. ‘ఈ శ్లోకం నన్ను కదిలించింది.. నా ఆత్మను తాకింది.. భారతీయ సంస్కృతి పట్ల నా అభిరుచిని రేకెత్తిస్తూనే ఉంది.’ అని ఆమె శీర్షిక పెట్టారు.  ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.