ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 11:46:25

అమెరికా తర్వాత ఇండియానే: వైట్‌ హౌస్‌

అమెరికా తర్వాత  ఇండియానే: వైట్‌ హౌస్‌

వాషింగ్టన్‌   కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో   ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో  ఉందని, ఆ తర్వాతి స్థానంలో భారత్‌  నిలిచిందని వైట్‌హౌస్‌ తెలిపింది. అమెరికా ఇప్పటి వరకు అత్యధికంగా 4.2 కోట్ల మందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. భారత్‌ 1.2 కోట్ల కరోనా  టెస్టులు చేసి రెండో స్థానంలో ఉందని వైట్‌హౌస్‌  ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్‌నాన్నీ  వెల్లడించారు. 

అమెరికాలో ఇప్పటి వరకు 35 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా  1,38,000 మంది చనిపోయారు.   ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 13.6మిలియన్లకు చేరగా.. 5,86,000 మంది మరణించారు. ప్రపంచంలోని  అన్ని దేశాలకన్నా అమెరికాలో ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, అందులో ఎటువంటి సందేహం లేదని    కైలీ చెప్పారు.  అమెరికా తర్వాత భారత్‌లో ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. 


logo