మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 02:04:07

‘మాయ’దారిలో మహమ్మారి

‘మాయ’దారిలో మహమ్మారి

సిడ్నీ: వైరస్‌ సోకిన రోగులతో కలువలేదు. గతంలో  విదేశాల్లో తిరిగిన దాఖలా లేదు. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లలేదు. అయినప్పటికీ, వైరస్‌ సోకుతున్నది. ఆసియా-పసిఫిక్‌ దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ తదితర దేశాల్లో ఇటీవల ఇలాంటి కేసులే ఎక్కువగా నమోదవు తుండటం అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వ్యాపిస్తున్న దన్న దానిపై సరైన స్పష్టత లేక ఆయా ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి. దీంతో విశ్వమారి కట్టడికి లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలను మళ్లీ అమల్లోకి తీసుకువస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైగా కేసులకు కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. కారణాలు తెలియకుండా వైరస్‌ సోకిన కేసులు టోక్యోలో గతంలో 19% ఉండగా, ప్రస్తుతం అవి 45 శాతానికి చేరాయని జపాన్‌ సర్కార్‌ వెల్లడించింది. మరోవైపు, స్థానికంగా నమోదవుతున్న కేసులకు గల మూల కారణాలు తెలియడం లేదని హాంకాంగ్‌, దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo