మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 09, 2020 , 14:47:34

టిక్‌టాక్‌ను నిషేధించాలంటున్న ఆస్ట్రేలియన్లు..!

టిక్‌టాక్‌ను నిషేధించాలంటున్న ఆస్ట్రేలియన్లు..!

సిడ్నీ: భారత్‌, అమెరికా బాటలో ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్‌టాక్‌తో డేటా చౌర్యం ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా శాసనసభ్యులు టిక్‌టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల, లిబరల్ సెనేటర్ జిమ్ మోలన్ మాట్లాడుతూ, టిక్‌టాక్‌ను చైనా ప్రభుత్వం వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించాడు.  విదేశీ జోక్యంపై సోషల్ మీడియాద్వారా సెలెక్ట్ కమిటీని ఎదుర్కోవాలని టిక్‌టాక్ ప్రతినిధులను లేబర్ సెనేటర్ జెన్నీ మెక్‌అలిస్టర్ డిమాండ్‌ చేసినట్లు సమాచారం. 

టిక్‌టాక్‌పై వస్తున్న ఆరోపణలను దాని యజమాని బైట్‌డాన్స్‌ ఖండిస్తూనే ఉన్నారు. టిక్‌టాక్‌ డేటా అంతా యూఎస్‌, సింగపూర్‌లోని సర్వర్లలో స్టోర్‌ అవుతుందని అతడు చెబుతున్నాడు. అయితే, చైనా ప్రభుత్వానికి డేటాను పొందడం చాలా కష్టమైన పనేంకాదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో అభిప్రాయపడింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo