సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 17:28:47

మాస్క్‌ ధరించకపోతే మూడు నెలల కఠిన శిక్ష

మాస్క్‌ ధరించకపోతే మూడు నెలల కఠిన శిక్ష

ప్యాంగ్యాంగ్‌ : దేశంలో కరోనా వైరస్ కేసులు లేవని ఒకవైపు చెప్తూనే.. మరోవైపు మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధిస్తామంటోంది ఉత్తర కొరియా ప్రభుత్వం. మాస్క్‌ ధరించని వారిని గుర్తించి మూడు నెలల కఠోర శ్రమను జరిమానాగా విధించనున్నట్టు పేర్కొన్నది. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ఈ కఠినమైన కొత్త నియమాలు విధిస్తున్నట్టు ఉత్తర కొరియా అధికారులు చెప్తున్నారు. పలువురు విద్యార్థులు మాస్క్ పెట్రోలింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. వీరు మాస్క్‌ ధరించని వారిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారు.

ఈ నెల16 వ తేదీ నుంచి ప్యాంగ్యాంగ్‌లో, ప్రాంతీయ నగరాల్లో పోలీసు అధికారులు, కళాశాల విద్యార్థులతో మాస్క్‌లు ధరించని వ్యక్తులను గుర్తించేందుకు తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాస్క్‌ ధరించని వారు ఎవరైనా వారితో సంబంధం లేకుండా మూడు నెలల కన్నా ఎక్కువ క్రమశిక్షణతో కూడిన కఠిన శ్రమ చేయాలని శిక్షించబడతారని ఉత్తర కొరియా అధికారి ఒకరు తెలిపారు.

సర్వం రహస్యంగా ఉండే ఉత్తర కొరియా దేశంలో లేబర్ క్యాంప్ శిక్షలు సర్వసాధారణం. ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పై విమర్శలు కూడా అనేకం  ఉన్నాయి. తమ దేశంలో కరోనా వైరస్ కేసులు లేవని పేర్కొన్నప్పటికీ.. ఇక్కడ కొవిడ్‌-19 కేసులు ఉన్నాయని కొన్ని వర్గాలు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి, కిమ్ జోంగ్ ఉన్ కరోనా వైరస్ బారిన పడ్డాడని ఊహాగానాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎటువంటి ధ్రువీకరణలు లేకపోయాయి.

తాజావార్తలు


logo