సోమవారం 25 జనవరి 2021
International - Dec 13, 2020 , 08:31:46

50 ఏండ్ల తర్వాత జోడియాక్‌ కిల్లర్‌ ‘కోడ్‌’ తెలి‌సింది

50 ఏండ్ల తర్వాత జోడియాక్‌ కిల్లర్‌ ‘కోడ్‌’ తెలి‌సింది

లాస్‌‌ఏం‌జిల్స్‌: యాభై ఏండ్ల క్రితం అమె‌రి‌కాలో ఓ సీరి‌యల్‌ కిల్లర్‌ ఉండే‌వాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో 1968, 1969 ప్రాంతంలో ఏడు‌గు‌రిని క్రూరంగా హత్య చేశాడు. అయితే, హత్యల అనం‌తరం ‘క్రి‌ప్టో‌గ్రా‌ఫిక్‌ లిపి (జో‌డి‌యాక్‌ సైన్స్‌-‌సం‌కే‌తాల భాష)’లో ఒక క్లూను వది‌లి‌వె‌ళ్లడం అత‌నికి అల‌వాటు. అలా అతను ‘జో‌డి‌యాక్‌ కిల్లర్‌’గా ప్రసిద్ధి చెందాడు. 1969లో శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్‌ అనే వార్తా‌ప‌త్రి‌కకు అతను క్రిప్టో లెటర్స్‌ ఉన్న ఒక సందే‌శాన్ని పంపాడు. ఆ కోడ్‌ భాషను పరీక్షించ‌డా‌నికి గత 50 ఏండ్లుగా క్రిప్టో‌గ్రఫీ ఔత్సా‌హి‌కులు ప్రయ‌త్నాలు చేస్తూనే ఉన్నారు. 


అయితే తాజాగా డేవిడ్‌ ఓరాం‌చక్‌ అనే అమె‌రి‌కన్‌ వెబ్‌ డిజై‌నర్‌.. మరో ఇద్దరి సాయంతో దీనిని ఛేదిం‌చాడు. ఆ సందే‌శంలో ఏమున్నదంటే.. ‘నన్ను పట్టు‌కో‌వ‌డా‌నికి మీరు ఉత్సా‌హంగా ఉన్నట్టు‌ న్నారు. మరణ శిక్షకు నేను భయ‌ప‌డటం లేదు. నా మార్గాన్ని అను‌స‌రించి నా కోసం పని‌చే‌య‌డా‌నికి త్వరలో అను‌చ‌రులు పుట్టు‌కు‌రా‌బో‌తు‌న్నారు’ అని ఆ జోడి‌యాక్‌ కిల్లర్‌ రాశాడు. అతను చెప్పి‌న‌ట్లు‌గానే, అతని ప్రభా‌వా‌నికిలోనై 1969లో పలు‌వురు కిల్లర్లు 37 మందిని హత్య చేశారు. ఆ కిరా‌తక కిల్లర్‌ ఆచూకీ ఇంకా తెలి‌య‌రా‌లేదు.


logo