శనివారం 28 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 11:09:57

ఆ దంప‌తుల‌కు 15వ కాన్పులో ఆడ‌బిడ్డ‌

ఆ దంప‌తుల‌కు 15వ కాన్పులో ఆడ‌బిడ్డ‌

ఆడబిడ్డ అంటేనే గిట్ట‌ని కొంత‌మంది త‌ల్లిదండ్రులు భ్రూణ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. లేదంటే ఆ బిడ్డ పుట్టిన త‌ర్వాత చెత్త‌కుప్ప‌ల్లో, ముళ్ల‌పొద‌ల్లో పడేస్తున్నారు. కానీ ఈ దంప‌తులు మాత్రం ఆడ‌బిడ్డ సంతానం కోసం పిల్ల‌ల‌ను కంటూనే ఉన్నారు. ఒక‌రిద్ద‌రూ కాదు ఏకంగా 14 మంది మ‌గ‌పిల్ల‌ల‌ను క‌న్నారు. 15వ కాన్పులో ఆడ‌బిడ్డ జ‌న్మించ‌డంతో ఆ దంప‌తుల సంతోషం అంతా ఇంతా కాదు.. 14 మంది మ‌గ‌పిల్ల‌ల త‌ర్వాత ఆడ‌బిడ్డ పుట్ట‌డం ఆనందంగా ఉంద‌ని త‌ల్లిదండ్రులు చెప్పారు. 

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన జాయ్‌, క‌తేరి దంప‌తుల‌కు గురువారం ఆడ‌బిడ్డ జ‌న్మించింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. పాప పుట్టిన‌ప్పుడు 3.4 కేజీల బ‌రువుతో జ‌న్మించింద‌ని తెలిపారు. త‌మ బిడ్డ‌కు 14 మంది అన్న‌లు ఉన్నారు. త‌మ కుటుంబంలోకి మ్యాగీ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంవ‌త్స‌రం ఎప్ప‌టికీ గుర్తుంటుంది. మ్యాగీ త‌మ‌కు గొప్ప బ‌హుమ‌తి అని దంప‌తులు పేర్కొన్నారు. జాయ్‌, క‌తేరి దంప‌తుల‌కు 1993లో వివాహ‌మైంది. వీరి పెద్ద కుమారుడు టేల‌ర్(28)కు ఇటీవ‌లే నిశ్చితార్థం జ‌రిగింది.