ఆదివారం 31 మే 2020
International - May 08, 2020 , 17:14:27

అఫ్ఘన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా

అఫ్ఘన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఫెరోజుద్దిన్‌ ఫెరోజ్‌ కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3700కు చేరింది. దేశంలో ఇప్పటివరకు వైరస్‌ ప్రభావంతో వంద మంది మరణించారు. 

ఇరాన్‌లో ఉన్న సుమారు 2,70,000 అఫ్ఘన్‌ వలస కూలీలు స్వదేశానికి తిరిగివచ్చారు. వీరివల్లే దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నదని అమెరికాకు చెందిన ఓ సంస్థ ప్రకటించింది.


logo