శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 19, 2020 , 02:23:57

అష్రఫ్‌కు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ పగ్గాలు

అష్రఫ్‌కు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ పగ్గాలు

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ అధినేతగా అష్రఫ్‌ ఘని మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం తుది ఫలితాలను వెల్లడించింది. ‘ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలకు సేవలందించేందుకు దేవుడు ఆయనకు సహాయం చేయాలి. దేశంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నా’ అని ఎలక్షన్‌ కమిషన్‌ అధిపతి హవా ఆలం నురిస్థానీ తెలిపారు. కాగా, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని అష్రఫ్‌ ఘని ప్రధాన ప్రత్యర్థి, ఆఫ్ఘన్‌ ముఖ్య కార్యనిర్వాహకుడు అబ్దుల్లా అబ్దుల్లా ఆరోపించారు. రీకౌంటింగ్‌ జరుపాలని ఆయన ఒత్తిడి చేయడంతో ఐదు నెలలు ఆలస్యంగా ఫలితాలు వెలువడ్డాయి. కాగా, మోసపూరిత ఫలితాలను అంగీకరించబోమని అబ్దుల్లా బృందం ఇటీవల తెలిపింది. సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అబ్దుల్లా మద్దతుదారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌ హెచ్చరించారు. 


logo