శనివారం 30 మే 2020
International - Apr 20, 2020 , 18:25:34

కృత‌జ్ఞ‌త‌లు మిత్ర‌మా: ప‌్ర‌ధాని మోదీకి అఫ్ఘాన్ ప్ర‌ధాని ట్వీట్‌

కృత‌జ్ఞ‌త‌లు మిత్ర‌మా: ప‌్ర‌ధాని మోదీకి అఫ్ఘాన్ ప్ర‌ధాని ట్వీట్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి అఫ్ఘానిస్థాన్ ప్ర‌ధాని ఆష్ర‌ఫ్ ఘ‌నీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 5,00,000 హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్‌లు, ల‌క్ష పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌తోపాటు 75 వేల మెట్రిక్ ట‌న్నులు గోధుమ‌లు స‌మ‌కూర్చినందుకు భార‌త దేశానికి, మిత్రుడైన భార‌త ప్ర‌ధాని మోదీకి కృతజ్ఞ‌త‌లు అంటూ ఘ‌నీ ట్వీట్ చేశారు. 75 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల్లో భాగంగా మొద‌టి విడుత‌గా 5000 మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌లు త‌మ దేశానికి చేరాయ‌ని ఆష్ర‌ఫ్ ఘ‌నీ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo