శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 18, 2020 , 17:20:28

ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మ‌ర‌ణం

ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మ‌ర‌ణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జ‌రిగింది. ఘాజ్నీ ప్రావిన్స్  గెలాన్ జిల్లాలో‌ని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్ల‌లో 15 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని మీడియా సంస్థ‌లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. అయితే ఈ పేలుళ్లు ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగాయా..? లేదంటే ఎవ‌రైనా ఉద్దేశ‌పూర్వ‌కంగా పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారా..? అనే వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉన్న‌ది. 

'గెలాన్ జిల్లా ఘాజ్నీ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో అంద‌రూ గుమిగూడి ఉన్న స‌మ‌మంలో పేలుళ్లు జ‌రిగాయి. ఈ పేలుళ్ల‌లో 15 మంది మ‌ర‌ణించారు. 20 మంది గాయ‌ప‌డ్డారు' అని ఇంటీరియ‌ర్ మినిస్ట్రీ అఫైర్స్ అధికార ప్ర‌తినిధి తారిఖ్ ఆరియ‌న్ తెలిపారు. ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌న్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి‌   

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది మృతి

పాక్‌ యుద్ధ నౌకను పసిగట్టిన భారత్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo