శనివారం 30 మే 2020
International - May 07, 2020 , 21:22:50

క‌రోనాతో ఆప్గాన్‌కు అతిఎక్కువ ముప్పు

క‌రోనాతో ఆప్గాన్‌కు అతిఎక్కువ ముప్పు

క‌రోనాతో అత్య‌ధికంగా ముప్పు ఆప్ఘ‌నిస్తాన్‌కు ఉంటుంద‌ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్నాయి.  ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో  దేశ జనాభాలో దాదాపు 80 శాతం కరోనా బారిన పడే ప్రమాదముంద‌ని చెబుతున్నాయి. మొత్తం 3.5 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్థాన్ లో సుమారు 50 లక్షలకుపైగా జనాభా దేశ రాజధాని కాబూల్‌లోనే ఉంది. అయితే కాబూల్ లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు  తేలిందని ఐవోఎం తెలిపింది. వాస్త‌వానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏండ్లు మాత్రమే కాగా. టీబీ, హెచ్‌ఐవి, పౌష్టికాహార లోపం, క్యాన్సర్, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడిస్తున్నాయి.

అటు ఆఫ్ఘన్‌లో నిరంతర అంతరుద్ధాల వల్ల ఇప్పటికే లక్షలాదిమంది పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల శరణార్థుల్ని తమ సొంత దేశాలకు పంపించడంపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్‌కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొన్నది.  ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో 2,900 కేసులు నమోదు కాగా, 90 మంది మరణించారు.


logo