శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 17:41:29

ఆఫ్ఘన్-తాలిబాన్ల శాంతి చర్చలు ప్రారంభం

ఆఫ్ఘన్-తాలిబాన్ల శాంతి చర్చలు ప్రారంభం

కాబూల్ : ఖతార్ వేదికగా ఆఫ్ఘన్ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యవర్తిగా నిలిచి చర్చించేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో దోహాలో మకాం వేశారు. ఈ చర్చల్లో సుమారు 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు సమాచారం. కాగా, ముఖాముఖి చర్చలు సోమవారం నుంచి జరుగుతాయని అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో పదివేల మందిని చంపిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమవడం విశేషం. 

దోహాలోని ఒక హోటల్‌లో నిర్వహించిన చర్చల్లో ముఖ్యవక్తలు ఆఫ్ఘనిస్తాన్ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రికన్సిలిషన్ చైర్‌పర్సన్ అబ్దుల్లా అబ్దుల్లా, తాలిబాన్ డిప్యూటీ లీడర్ ముల్లా అబ్దుల్ ఘని బరదార్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ప్రసంగించనున్నారు. అమెరికాలో ఫిబ్రవరి 29 న కుదిరిన ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి కోసం అమెరికా, తాలిబాన్ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 29 న తాలిబాన్ సంతకం చేసింది. దీని ప్రకారం తాలిబాన్ హింసను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పలు దశల్లో సైనికులను అమెరికా ఉపసంహరించుకోవలసి వుంటుంది. ఒప్పందం ప్రకారం.. తాలిబాన్లు అల్-ఖైదా, ఇతర ఉగ్రవాద గ్రూపులను విడిచిపెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఉగ్రవాద దాడులను కూడా నిలుపవలసి ఉంటుంది.

5 వేల మంది తాలిబాన్ ఉగ్రవాదుల విడుదల

శాంతి చర్చలు ప్రారంభించడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ ఏడాది 5 వేల మంది తాలిబాన్ ఉగ్రవాదులను విడుదల చేసింది. ఇందులో చాలా మంది సైనికులు, పౌరులను చంపిన 400 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అష్రఫ్ ఘని ప్రభుత్వం గత వారం 3,200 సంఘ నాయకులు, రాజకీయ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు ఖైదీలను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకున్నారు. చర్చలు విజయవంతమైతే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తిరిగి రావడం ద్వారా ట్రంప్ ప్రయోజనం పొందుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. 


logo