శుక్రవారం 14 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 14:54:26

కొవిడ్‌తో ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్ష ప్రత్యేక రాయబారి మృతి

కొవిడ్‌తో ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్ష ప్రత్యేక రాయబారి మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడి ప్రత్యేక రాయబారి యూసుఫ్‌ గజన్ఫార్‌ కొవిడ్‌-19తో కన్నుమూశాడు. దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీకి గజన్ఫార్‌ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడు కొవిడ్‌ బారిన పడ్డాడు. టర్కీలో చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో మరణించాడని అధ్యక్షుడి వ్యూహాత్మక సంబంధాల సలహాదారు షాజైన్‌ ముర్తాజావి పేర్కొన్నాడు. 

కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో ఏప్రిల్‌లో భారీస్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సుమారు 40 మంది సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారు. కాగా, అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీకి మాత్రం నెగెటివ్‌ వచ్చింది. ఆ దేశంలో ఇప్పటివరకూ 32,000 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 819 మంది మృత్యువాతపడ్డారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo