ఆదివారం 29 మార్చి 2020
International - Mar 21, 2020 , 10:58:42

కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణాది రాష్ట్రం జాబుల్‌ రాజధాని ఖాలత్‌కు సమీపంలోని సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల్లో శుక్రవారం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిద్ర పోతున్న జవాన్లపై పలువురు సహచర జవాన్లు కాల్పులు జరిపారని జాబుల్‌ గవర్నర్‌ రహ్మతుల్లా యార్మల్‌ చెప్పారు. మృతుల్లో 14 మంది సైనికులు, 10 మంది పోలీసులు ఉన్నారు. మరో నలుగురు ఆఫ్ఘన్‌ సైనికుల ఆచూకీ తెలియడం లేదు. దాడికి పాల్పడిన వారికి తాలిబన్లతో సంబంధం ఉందని జాబుల్‌ రాష్ట్ర మండలి అధిపతి అతా జాన్‌ హక్‌ బయాన్‌ చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత వారు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో నింపిన రెండు ట్రక్కుల్లో పారిపోయారని ఆరోపించారు. దీనిపై స్పందించేందుకు తాలిబన్లు నిరాకరించారు.


logo