శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 08:28:15

ఆఫ్ఘన్‌ జైళ్ల నుంచి 86 మంది తాలిబన్లు విడుదల

ఆఫ్ఘన్‌ జైళ్ల నుంచి 86 మంది తాలిబన్లు విడుదల

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ జైళ్లలో ఉన్న తాలిబన్లను విడుదల చేసే ఒప్పందంలో భాగంగా ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం 86 మందికి విముక్తి కల్పించింది. ఇంకా 300 మందికిపైగా జైళ్లలో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు చరమగీతం పాడే దిశగా ఫిబ్రవరిలో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్‌, తాలిబన్లు ఒప్పందం చేసుకున్నారు. ఇరువైపులా బందీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఒప్పందం సమయంలో జైళ్లలో 5వేల మంది తాలిబన్లు ఉన్నారు. తాలిబన్ల చెరలో 1000 మందికిపైగా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. బందీల విడుదల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.logo