గురువారం 28 మే 2020
International - Apr 08, 2020 , 15:35:22

ఆప్గాన్: మ‌రోసారి తాలిబ‌న్ల విధ్వంసం

ఆప్గాన్: మ‌రోసారి తాలిబ‌న్ల విధ్వంసం

కాబూల్‌: ఆప్గానిస్తాన్‌లో తాలిబ‌న్లు మ‌రోసారి రెచ్చిపోయారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలే ల‌క్ష్యంగా తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు బాల్క్ ప్రావిన్స్‌లో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల‌కు  సంబంధించి ఏడుగురు పౌరులు మృతిచెందిన‌ట్లు ఆప్గాన్ అధికారులు తెలిపారు. షోల్గారా జిల్లాలో ఇరు వర్గాల మధ్య దాడులు జరగ్గా ఏడుగురు పౌరులను తాలిబన్‌ ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వారిని హ‌త‌మార్చిన‌ట్లు స్థానిక పోలీస్‌లు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి తాలిబన్‌ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాగా, గత ఫిబ్రవరి చివరలో తమతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించింద‌ని తాలిబన్‌ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.


logo