మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 22:38:07

అబ్రహం లింకన్ వెంట్రుకల ధర అక్షరాలా రూ.59 లక్షలు

అబ్రహం లింకన్ వెంట్రుకల ధర అక్షరాలా రూ.59 లక్షలు

బోస్టన్ : అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ వెంట్రుకలు 81,250 డాలర్లకు అమ్ముడుపోయాయి. అంటే అక్షరాలా రూ.59,63,477.81. ఇంత పెద్ద మొత్తం వెచ్చించి స్వంతం చేసుకున్న వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని వేలం వేసిన బోస్టన్ కు చెందిన సంస్థ ఆర్ఆర్ ఆక్షన్స్ వెల్లడించలేదు. వేలం శనివారం జరిగినట్లుగా తెలుస్తున్నది. 

వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటర్ వద్ద 1865లో అబ్రహం లింకన్ ను జాన్ విల్కేస్ బూత్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. అనంతరం జరిగిన పోస్టుమార్టం పరీక్షలో సుమారు 2 అంగుళాల (5 సెంటీమీటర్లు) పొడవాటి జుట్టును తొలగించారు. శవపరీక్ష జరిపిన లింకన్ భార్య మేరీ టాడ్ బంధువు డాక్టర్ లైమాన్ బీచర్ ఈ వెంట్రుకలను భద్రపరిచారు. కెంటకీలోని లెక్సింగ్టన్ పోస్ట్ ఆఫీస్ లో తన సహాయకుడు జార్జ్ కిన్నేర్.. డాక్టర్ టాడ్ కు పంపిన అధికారిక వార్ డిపార్ట్మెంట్ టెలిగ్రాంలో జుట్టును అమర్చిపెట్టారు. 

డాక్టర్ టాడ్ కుమారుడు జేమ్స్ టాడ్ 1945 లో రాసిన లేఖలో అబ్రహం లింకన్ జుట్టు అప్పటి నుంచి పూర్తిగా మా కుటుంబం ఆధీనంలో ఉంది" అని రాశారు. ఈ వెంట్రుకలు చివరిసారిగా 1999 లో విక్రయించినట్లు వేలం హౌస్ తెలిపింది. బోస్టన్ కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ సంస్థ శనివారం మరోసారి నిర్వహించిన వేలంలో ఒకరు 81,250 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను సదరు సంస్థ వెల్లడించలేదు.


logo