గురువారం 04 జూన్ 2020
International - Apr 10, 2020 , 09:15:56

అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కోటిన్న‌ర ద‌ర‌ఖాస్తులు

అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కోటిన్న‌ర ద‌ర‌ఖాస్తులు

వాషింగ్ట‌న్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. కరోనా బారిన పడినవారి సంఖ్య నాలుగు ల‌క్ష‌లు దాటింది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 16 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఆర్థికంగానూ అగ్రరాజ్యం నష్టాల్లో కొనసాగుతోంది. క‌రోనా కార‌ణంగా అక్క‌డి చాలా సంస్థలు మూతపడ్డాయి. 48 రాష్ట్రాలు ప్రాధాన్యంకాని వ్యాపారాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల వ్యవధిలోనే ప్రతి 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోగా నిరుద్యోగం అమాంతం పెరిగిపోయింది.

ఈ నేప‌థ్యంలో నిరుద్యోగ బెనిఫిట్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్న‌ వారి సంఖ్య పెరుగుతోంది. గత మూడు వారాల్లోనే నిరుద్యోగ భృతిని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 1.66 కోట్లకు చేరింది. కాగా, అమెరికాలో ఇంత‌పెద్ద స్థాయిలో నిరుద్యోగాలు పెరిగిపోవ‌డం 1948 త‌ర్వాత‌ ఇదే తొలిసార‌ని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఈ నెలలో 2 కోట్ల మందికిపైగా అమెరికన్లు ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo