శుక్రవారం 27 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 02:35:31

అబ్బో.. ఎంత పెద్ద పగడపు దిబ్బో!

అబ్బో.. ఎంత పెద్ద పగడపు దిబ్బో!

  • ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైనది మరి

న్యూయార్క్‌: సముద్ర జీవజాలానికి ఆలవాలమైన పడగపు దిబ్బలు సాధారణంగా చిన్నచిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా సమీపంలోని గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌లో మాత్రం గతంలో ఎన్నడూ చూడనంతటి పెద్ద పగడపు దిబ్బను పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని నార్త్‌ క్వీన్స్‌ల్యాండ్‌ సముద్ర జలాల్లో కనుగొన్న ఈ పగడపు దిబ్బ విస్తీర్ణం 1.5 కిలోమీటర్లు. ఎత్తు 500 మీటర్లు. అంటే 1640 అడుగులు. ప్యారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్‌ టవర్‌ (324 మీటర్లు) కంటే ఈ పగడపు దిబ్బనే ఎత్తైనది. సముద్ర జలాల్లో పగడపు దిబ్బలపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో సుబాస్టియన్‌ అనే తమ రోబోట్‌ ఈ పగడపు దిబ్బను గుర్తించిందని అమెరికాలోని ష్మిడ్త్‌ ఓషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు. నార్త్‌ క్వీన్స్‌ల్యాండ్‌ సముద్ర జలాల్లోని గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌లో ఇంత పెద్ద పడగపు దిబ్బను కనుగొనడం గత 120 ఏండ్లలో ఇదే తొలిసారని వాళ్లు తెలిపారు.