శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 21, 2020 , 14:08:49

తిమింగలం పై సవారీ చేసిన యువకుడు.....

 తిమింగలం పై సవారీ చేసిన యువకుడు.....

రియాద్ : సౌదీ అరేబియాలోని యంబు పట్టణ తీరంలో ఉన్న రెడ్ సీ లో కొంతమంది యువకులు బోటింగ్ కు వెళ్లారు. అయితే, వారికి రెండు తిమింగలాలు కనిపించాయి. దీంతో ఓ యువకుడికి దానిపై ఎక్కి సవారీ చేయాలనే కోరిక కలిగింది. వెంటనే ఓ తిమింగలం మీదకు దూకి దాని మొప్పలను గట్టిగ మడిచి పట్టుకున్నాడు. దీంతో తిమింగలం అక్కడే కాసేపు ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. కొంతమంది అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo