శనివారం 29 ఫిబ్రవరి 2020
మూడో పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి దేహశుద్ది..

మూడో పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి దేహశుద్ది..

Feb 12, 2020 , 18:14:50
PRINT
మూడో పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి దేహశుద్ది..

కరాచీ: పెళ్లి వేడుకకు అంతా సిద్దమైంది. బంధువులంతా పెళ్లి వేడుకకు వచ్చారు. పెళ్లికొడుకు వేదికపైకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలోనే ఓ మహిళ పెళ్లికొడుకు దగ్గరకు ఆవేశంగా వచ్చి అతని కాలర్‌ పట్టుకుంది. సదరు మహిళ పెళ్లికొడుకును అతిథులందరి ముందే చితకబాది పెళ్లి దుస్తులను చింపేసింది. ఈ ఘటన కరాచీలోని సఖి హస్సన్‌ చౌరంగీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా..? మహిళ చేతిలో చివాట్లు తిన్న ఆ వరుడికి ఇది మూడోపెళ్లి. అతడు తన్నులు తిన్నది తన మొదటి భార్య చేతుల్లోనే. 

వివరాల్లోకి వెళ్తే..ఆసిఫ్‌ రఫీక్‌ అనే వ్యక్తి 2014లో మదిహను వివాహం చేసుకున్నాడు. ఆసిఫ్‌ రఫీక్‌ ఆ తర్వాత మదిహకు తెలియకుండా జన్నా యూనివర్సిటీలో పనిచేస్తున్న మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మదిహ తన భర్త ఆసిఫ్‌ రఫీక్‌తో గొడవపడింది. అయితే ఆసిఫ్‌ రఫీక్‌ తనతో మాత్రమే ఉంటానని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మదిహ చల్లబడ్డది. ఆసిఫ్‌ రఫీక్‌ అంతటితో ఆగకుండా తాజాగా మరో యువతితో పెళ్లికి సిద్దమైనట్లు తెలుసుకున్న మదిహ తన కుంటుంసభ్యులతో కలిసి వివాహం జరుగుతున్న ప్రాంతానికెళ్లి ఆసిఫ్‌ రఫీక్‌కు దేహశుద్ది చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మదిహ కుటుంబసభ్యుల నుంచి రఫీక్‌ను కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే తాను మదిహకు విడాకులిచ్చానని, ఒకేసారి నలుగురి మహిళలను కూడా పెళ్లి చేసుకునే హక్కు  తనకు ఉందని పోలీసుల ముందు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు..ఇద్దరు కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు.


logo