రియో డిజనీరో: అడవుల్లోకి మనం రోడ్లేసుకొని చొచ్చుకెళ్తుంటే.. ఆ అడవిలోని జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి సీన్లు చాలా కామన్ అయిపోయాయి. అలాంటిదే బ్రెజిల్లో కనిపించింది. ఓ భారీ అనకొండ రోడ్డు ( Anaconda on Road ) దాటుతుండగా.. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. చుట్టూ వాహనాలు, జనాలు ఉన్నా కూడా 10 మీటర్ల పొడవుతున్న ఆ అనకొండ నెమ్మదిగా అలా అలా రోడ్డు దాటేసి వెళ్లిపోయింది. ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఇది చాలా భయానకంగా ఉన్నదని కొందరు కామెంట్ చేశారు.