ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 13:03:57

కెనడాలో భారతీయ జెండాలతో.. భారీ కారు ర్యాలీ

కెనడాలో భారతీయ జెండాలతో.. భారీ కారు ర్యాలీ

ఒట్టావా: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనడాలోని భారతీయులు తమ దేశ భక్తిని చాటారు. కెనడా చరిత్రలోనే తొలిసారి భారతీయ జెండాలతో భారీగా కారు ర్యాలీ నిర్వహించారు. ఆ దేశంలోని భారతీయులకు చెందిన 'ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా-కెనడా', 'గురుకుల్ ఎడ్యుకేషన్, కల్చర్ సొసైటీ ఆఫ్ కెనడా' సంస్థలు కలిసి సర్రే నుండి వాంకోవర్ వరకు 'తిరంగ కార్ ర్యాలీ'ని చేపట్టాయి. కార్లకు ఇరు వైపులా భారతదేశ జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకంతోపాటు కెనడా దేశ జెండాను ఉంచారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు త్రివర్ణ టీ షర్టులను ధరించారు. సర్రే‌లోని బేర్ క్రీక్ పార్క్ నుంచి వాంకోవర్ ఆర్ట్స్ గ్యాలరీ వరకు నిర్వహించిన ఈ తిరంగ కార్ ర్యాలీలో సుమారు 200కుపైగా కార్లు పాల్గొన్నాయి.

ఇలాంటి కారు ర్యాలీ నిర్వహించడం కెనడా చరిత్రలో ఇదే తొలిసారి అని చెందిన 'ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా-కెనడా'కు చెందిన మనీందర్ సింగ్ గిల్ తెలిపారు. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, బహుళ సాంస్కృతిక బంధం బలోపేతం కోసం ఈ 'తిరంగ కార్ ర్యాలీ'ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు. కార్ ర్యాలీ ప్రారంభం, ముగింపు వేదికల వద్ద జరిగిన కార్యక్రమాల్లో పలు దేశాలకు చెందిన సంస్థలుతోపాటు కెనడా చట్టసభ సభ్యులు పాల్గొన్నట్లు వెల్లడించారు.


logo