మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 14:05:31

దొంగిలించిన కార్లతో ఢీకొన్న ఇద్దరు దొంగలు

దొంగిలించిన కార్లతో ఢీకొన్న ఇద్దరు దొంగలు

న్యూయార్క్: ఇద్దరు దొంగలు.. దొంగిలించిన కార్లతో ఒకరినొకరు ఢీకొన్నారు. అమెరికాలోని న్యూబెర్గ్ నగరంలో జూలై 5న ఈ ఘటన జరిగింది. రాండి లీ కూపర్ అనే 27 ఏండ్ల వ్యక్తి టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును చోరీ చేసి దాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ కారును గుర్తించి దాన్ని వెంబడించారు. దీంతో కారును మరింత వేగంగా నడిపిన రాండి, కొంత సమయం తర్వాత మరో కారును ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బ్యూక్ రీగల్ కారును క్రిస్టిన్ నికోల్ బేగ్ అనే 25 ఏండ్ల యువతి నడుపుతున్నది. అయితే ఆమె కూడా ఆ కారును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె నడుపుతున్న కారు చోరీ అయినట్లు మూడు వారాల కిందట ఫిర్యాదు అందింది. మరోవైపు మాదకద్రవ్యాల మత్తులో ఉన్న ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఇద్దరు కారు దొంగల గురించి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా నెటిజన్లు ఛలోక్తులు విసిరారు. ఇలాంటిది ఎప్పుడూ వినలేదని, పోలీసులు చరిత్ర సృష్టించారంటూ వ్యాఖ్యానించారు.




logo