శుక్రవారం 03 జూలై 2020
International - Jul 01, 2020 , 10:36:50

ఖాట్మండుపై మిడ‌త‌ల దండ‌యాత్ర!‌

ఖాట్మండుపై మిడ‌త‌ల దండ‌యాత్ర!‌

ఖాట్మండు: ఎడారి మిడ‌త‌ల బెడ‌ద ఇప్పుడు నేపాల్‌ను కూడా తాకింది. నేపాల్ రాజ‌ధాని ఖాట్మండులోకి మంగ‌ళ‌వారం సాయంత్రం పెద్ద సంఖ్య‌లో మిడ‌త‌ల గుంపులు ప్ర‌వేశించాయి. న‌గ‌రంలోని నివాసాల‌పైన‌, ప‌రిస‌రాల్లోని పంట‌చేల‌పైన ఏక‌కాలంలో మిడ‌త‌ల గుంపులు ఎటాక్ చేశాయి. దీంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. కొంత‌మంది భ‌వ‌నాల‌పైకి ఎక్కి వంట‌గిన్నెలు, రేకు డ‌బ్బాల శ‌బ్దం చేస్తూ మిడ‌త‌లను త‌రిమికొట్టారు. పంట పొలాల్లో మిడ‌త‌లు వాల‌కుండా రైతులు ర‌సాయ‌నాలు చ‌ల్లుకున్నారు. 

కాగా, గ‌త కొన్ని నెల‌లుగా భార‌త్‌లోని రాజ‌స్థాన్‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, డిల్లీ త‌దిత‌ర రాష్ట్రాల్లో పంట‌ల‌పై దాడులు చేసిన మిడ‌త‌లు ఈశాన్య దిశ‌గా ప‌య‌నిస్తూ ఇప్ప‌డు నేపాల్‌లో ప్ర‌వేశించాయి. సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతం నుంచి పాకిస్థాన్ మీదుగా ఈ మిడ‌త‌లు భార‌త్‌లో ప్ర‌వేశించాయి. ఈ రోజు కూడా రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌, నాగౌర్ జిల్లాల్లోని పంట‌చేల‌పై ఎడారి మిడ‌త‌లు దాడులు చేశాయి.   logo