బ్యాంకాక్: ఒక పాము ఉన్నట్టుండి ఒక వ్యక్తి వెంట పడింది. దీంతో అతడు భయంతో పరుగులు తీశాడు. థాయిలాండ్లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఒక ఇంటి లాబీలోని డిన్నర్ టేబుల్ వద్ద ఒక వ్యక్తి సర్దుతున్నాడు. ఇంతలో ఒక వైపు నుంచి వచ్చిన పాము అతడిపై దాడి చేయబోయింది. క్షణంలో గమనించిన అతడు భయంతో వేగంగా పరుగు తీశాడు. ఆ పాము కూడా అంతే వేగంగా అతడి వెంట పడింది. చివరకు సమీపంలోని పొదల్లోకి అది వెళ్లిపోయింది.
కాగా, ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసి నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. పాములు ఇంత దూకుడుగా దాడి చేస్తాయా అని కొందరు, ఇది ఊహించని దాడి అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాము ఒక వ్యక్తిని హత్య చేయబోయిందని ఒకరు చమత్కరించారు.