గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 09:16:27

క‌రోనా మ‌ర‌ణాల్లో ఎక్కువ శాతం వృద్ధులే:WHO

క‌రోనా మ‌ర‌ణాల్లో ఎక్కువ శాతం వృద్ధులే:WHO

జెనీవా: క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్కువ శాతం వృద్ధుల‌పైనే  ప్ర‌భావం చూపుతుంద‌ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (WHO) తెలిపింది. ఈ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణిస్తున్న వారిలో 95శాతం వృద్ధులే ఉంటున్నార‌ని ప్ర‌క‌టించింది. యూరప్‌లో ఇలాంటి కేసులే ఎక్కువ‌గా న‌మోద‌య్యాయ‌ని WHO ప్ర‌క‌టించింది. మ‌ర‌ణించిన వారిలో 80ఏండ్ల వ‌య‌సు దాటిన వారేన‌ని తెలిపింది.  మ‌ర‌ణించిన వారిలో ఇత‌ర స‌మ‌స్యలు అంటే గుండె జ‌బ్బులు, హైబీపీ, షుగ‌ర్ లాంటి వ్యాధుల‌తో బాధ‌పడుతున్నవారేన‌ని వివ‌రించింది. అటు 20 ఏండ్ల లోపు వారికి కూడా క‌రోనా సోకుతుంద‌ని...త‌మ‌కు రాద‌ని భావించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ..అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని WHO సూచించింది. 


logo