దుబాయ్, మార్చి 24: ఈజిప్టులోని సూయజ్ కాల్వలో ఓ భారీ కంటైనర్ అడ్డంతిరిగింది. ఆసియా-యూరప్ మధ్య సరుకు రవాణా చేసే ‘ఎంవీ ఎవర్ గివెన్’ అనే ఈ కంటైనర్ ప్రపంచంలోనే అతి పెద్దవాటిలో ఒకటి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సూయజ్ కాల్వలో ఈ ఘటనతో మార్గం మూసుకుపోయి నౌకా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బలమైన గాలుల వల్లే కంటైనర్ అడ్డం తిరిగిందని దానిని నిర్వహించే తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ తెలిపింది.