గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 11, 2020 , 18:45:50

ఆన్‌లైన్‌ స్లీపింగ్‌ క్లాస్‌..! బాలుడి ఫొటో వైరల్‌..

ఆన్‌లైన్‌ స్లీపింగ్‌ క్లాస్‌..! బాలుడి ఫొటో వైరల్‌..

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థ తీరుతెన్నులనే మార్చివేసింది. తరగతి గదులను వర్చువల్‌ చేసింది. దీంతో కిండర్‌ గార్డెన్‌ పిల్లలకు కూడా ఆన్‌లైన్‌ క్లాసులు తప్పడం లేదు. వారు అసలు తరగతి గదుల్లోనే కుదురుగా ఉండరు. మరి ఆన్‌లైన్‌ క్లాసులు వింటారా..? ఓ స్కూల్‌ జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసులో ఓ పిల్లాడు బెంచిపైనే నిద్రపోయాడు. దీన్ని అతడి తండ్రి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా, ఆ వీడియో వైరల్‌ అయ్యింది. 

ఓ స్కూల్‌ యాజమాన్యం ఆన్‌లైన్‌ క్లాస్‌ నిర్వహిస్తోంది. జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న కిండర్‌గార్డెన్‌ క్లాస్‌కు హాజరైన ఓ పిల్లాడికి నిద్ర రావడంతో అక్కడే బెంచీపై పడుకున్నాడు. దీన్ని గమనించిన వాళ్ల తండ్రి కారా మెక్‌డోవెల్ అనే రచయిత ఫొటో తీసి, ట్విట్లర్‌లో పెట్టాడు. ‘40 నిమిషాల వీడియో క్లాస్‌లో నా కిండర్‌గార్డ్‌నర్‌ మానసిక స్థితి ఇది..’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 8000 రీట్వీట్లు, 50,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది.  


logo