మంగళవారం 26 మే 2020
International - Apr 25, 2020 , 16:58:53

రష్యాలో తగ్గని తీవ్రత..ఒక్కరోజులోనే 5,966 కేసులు

రష్యాలో తగ్గని తీవ్రత..ఒక్కరోజులోనే  5,966 కేసులు

మాస్కో: కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా అతలాకుతలమవుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడే..అప్రమత్తమై కరోనా కట్టడి చర్యలు తీసుకున్పప్పటికీ వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య ప్రతిరోజు గణనీయంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 5,966 కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 74,588కు చేరింది. ఇప్పటి వరకు ఆదేశంలో 681 మంది ప్రాణాలు కోల్పోగా..6,250 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గత వారం రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 70వేలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు కనీసం 5వేలకుపైనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రష్యాలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 


logo