e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News మ‌త్స్య‌కారుడికి జాక్‌పాట్.. చేప క‌డుపులో విస్కీ ఫుల్ బాటిల్‌

మ‌త్స్య‌కారుడికి జాక్‌పాట్.. చేప క‌డుపులో విస్కీ ఫుల్ బాటిల్‌

స‌ముద్రంలో చేప‌ల వేట ప్ర‌తిరోజూ ఒకే ర‌క‌మైన ఫ‌లితాన్ని ఇవ్వ‌దు. రోజంతా వేట కొన‌సాగినా ఓసారి నిరాశ‌తో వెనుతిర‌గాల్సి రావొచ్చు. మ‌రోరోజూ అనుకోని విధంగా ఆశించిన దానికంటే ఎక్కువే ద‌క్కొచ్చు. ఈ విధంగానే ఓ యువ మ‌త్స్య‌కారుడు జాక్ పాట్ కొట్టేశాడు. వేట‌లో అత‌డికి పెద్ద చేప దొర‌క‌డ‌మే కాదు. దాని లోప‌ల అనుకోని విధంగా మ‌ద్యం ఫుట్‌ బాటిల్ కూడా ల‌భించింది. ల‌క్కీ మ్యాన్‌.. క్యాచ్ ఆఫ్ ది డే అంటూ సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయింది.

చేప‌ల వేట అనంత‌రం ఓ పెద్ద చేప‌ను మ‌త్స్య‌కారుడు బోటులోని టేబుల్‌పై ఉంచి క‌త్తితో త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ప్రారంభించాడు. ఇలా చేప‌ను క‌ట్ చేసి శుభ్ర‌ప‌రుస్తుండ‌గా చేప క‌డుపు లోప‌లి భాగాల్లో అనుకోని విధంగా ఓ ఆబ్జెక్ట్ ఉన్న‌ట్లుగా గుర్తించాడు. క‌త్తితో కోసి చూడ‌గా విస్కీ ఫుల్ బాటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అత‌ని సంతోషానికి అవ‌దులు లేకుండా పోయాయి.

- Advertisement -

టిక్‌టాక్ యూజర్ బెనిబాన్ దీన్ని పంచుకోవ‌డంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియో దాదాపు 6 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. అయితే వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. కాగా ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. బాధ్యతా రహితమైన మానవ ప్రవర్తన ఇలా జంతుజ‌లాల‌కు ఏ విధంగా ముప్పును క‌లిగిస్తుందో స్ప‌ష్ట‌మౌతుంద‌ని పేర్కొన్నారు. మ‌రికొంద‌రు ప్ర‌చారం కోసం అత‌డే చేప క‌డుపులో బాటిల్ చొప్పించి ఉండ‌వ‌చ్చ‌ని వాదిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana