సోమవారం 25 జనవరి 2021
International - Dec 25, 2020 , 17:19:14

ఆకాశం నుంచి ప‌డిన భారీ ఫైర్‌బాల్.. ఉల్కేనా?

ఆకాశం నుంచి ప‌డిన భారీ ఫైర్‌బాల్.. ఉల్కేనా?

బీజింగ్‌: వాయ‌వ్య చైనాలోని యుషు న‌గరంలో బుధ‌వారం భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఆకాశం నుంచి ఓ ఫైర్‌బాల్ ప‌డ‌టంతో భారీ పేలుడు సంభ‌వించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కిన్‌ఘాయ్ ప్రావిన్స్‌లోని నాంగ్‌కియాన్ కౌంటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌స్తుతానికి ఈ ఫైర్‌బాల్ ఏంటి? ఎక్క‌డ నుంచి ప‌డిందన్న దానిపై స్ప‌ష్టమైన స‌మాచారం లేదు. అయితే స్థానిక మీడియా.. అదొక ఉల్క అంటూ వార్త‌లు ప్ర‌చురించింది. ఈ ఫైర్‌బాల్ ప‌డిన స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఫైర్‌బాల్‌ను తాను నేరుగా చూసిన‌ట్లు ఓ వ్య‌క్తి తెలిపాడు. మొద‌ట్లో అది చాలా చిన్న‌గా క‌నిపించింద‌ని, త‌ర్వాత సైజు భారీగా పెరిగి, మ‌రింత ప్ర‌కాశవంతంగా మారింద‌ని అత‌ను చెప్పాడు. అంతేకాకుండా షియాన్ నుంచి లాసాకు విమానంలో వెళ్తున్న వాళ్లు కూడా ఈ ఫైర్‌బాల్‌ను చూసిన‌ట్లు చెప్పారు. చైనాకు చెందిన‌ ది ఎర్త్‌క్వేక్ నెట్‌వ‌ర్క్ సెంట‌ర్ ఈ ఘ‌ట‌న‌ను రికార్డు చేసిన‌ట్లు తెలిపింది. దీనిని ఉల్క‌గా అనుమానిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 


logo