శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 16:55:24

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.3 లక్షలు జరిమానా!

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.3 లక్షలు జరిమానా!

విక్టోరియా : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్ట్రేలియా రాష్ర్టం విక్టోరియాలో భారీగా జరిమానా విధిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు పట్టుబడితే అక్కడికక్కడే $ 5,000 (సుమారు రూ.3లక్షలు పైనే) జరిమానా విధించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్న సుమారు 800 మందిని అక్కడి అధికారులు గుర్తించి జరిమానా విధించినట్లు సమాచారం .

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు దాడులు కూడా జరిపారు. అదే విధంగా కరోనా రోగులు సరైన పేర్లు, చిరునామాలను ఇవ్వాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికార యంత్రాంగం ఆదేశించింది. తప్పుడు అడ్రస్‌ ఇచ్చిన వారిని కనిపెట్టేందుకు పోలీసులు నానా కష్టాలు పడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మంగళవారం ఆస్ట్రేలియా రాష్ట్రంలో కొత్తగా 439 కరోనా కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo