ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 14:51:37

అక్కడ మాస్కు ధరించకపోతే రూ.15వేలు జరిమానా

అక్కడ మాస్కు ధరించకపోతే రూ.15వేలు జరిమానా

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా నగరమైన మెల్‌బోర్న్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మాస్కు ధరించడం తప్పనిసరి అని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మెల్‌బోర్న్‌‌లోని విక్టోరియా రాష్ర్టంలో ఆదివారం మరో 363 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మెల్‌బోర్న్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. నగరంలో, మిచెల్ షైర్‌లోని ప్రజలు బుధవారం అర్థరాత్రి నుంచి తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపారు. "మీరు మీ మాస్కు లేకుండా బయట తిరిగి కరోనా వ్యాప్తి చెందవద్దు అంటే అది ఆగేది కాదు. కరోనాను కట్టడి చేయాలంటే ఖచ్చితంగా మాస్కు ధరించాలి’’ అని ఆండ్రూస్‌ అన్నారు.  మాస్కు ధరించకపోతే $ 200 (రూ.15వేలు) జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 12,000 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం 122 మంది మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo