శనివారం 06 జూన్ 2020
International - Apr 19, 2020 , 17:14:57

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

మాస్కో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా అతలాకుతలమవుతోంది.  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  శనివారం  4,785 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 6,060 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఎనిమిదో రోజు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  దీంతో ఆ దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 42,853కు చేరింది. 

ఇప్పటి వరకు మొత్తం 361 మంది చనిపోయారు. ఆదివారం వరకు 3,291 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.    కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన 132,000 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.    కరోనా నివారణకు  దేశాధ్యక్షుడు  వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇప్పటికే  లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగించారు.


logo