శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 02:50:26

పేలుడుపదార్థాలు తిని మరణించిన గోవు

పేలుడుపదార్థాలు తిని మరణించిన గోవు

  • కర్ణాటకలో ఘటన 

మైసూర్‌: కేరళలో పేలుడు పదార్థాలతో నింపిన పైనాపిల్‌తో గర్భిణి ఏనుగును బలిగొన్న దుర్ఘటన మరువక ముందే కర్ణాటకలో అటువంటిదే మరో దారుణం జరిగింది. కర్ణాటకలోని హెచ్డీ కోటె తాలూకా బెట్టడబీడు గ్రామంలో రైతులు తమ పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపేందుకు చెట్ల పొదల్లో గడ్డి మాటున పేలుడు పదార్థాలను పెట్టారు. వాటిని ఆహారంగా భావించి ఓ ఆవు కొరకడంతో నోటిలో అవి పేలిపోయి ఆ ఆవు తీవ్రంగా గాయపడింది. గోవును మైసూర్‌ నగర శివారుల్లోని గో సహాయ, పునరావాస కేంద్రానికి తరలించారు. పశువైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం సాయంత్రానికి ఆ ఆవు ప్రాణాలు కోల్పోయింది.


logo