మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 18:42:14

కరోనాను జయించిన 106 ఏండ్ల వృద్ధురాలు, ఆమె కుటుంబం

కరోనాను జయించిన 106 ఏండ్ల వృద్ధురాలు, ఆమె కుటుంబం

కరోనాను జయించిన 106 ఏండ్ల వృద్ధురాలు, ఆమె కుటుంబం

తైఫ్‌ : సౌదీ అరేబీయాలోని తైఫ్‌లో కరోనా వైరస్ బారి నుంచి ఓ శతాబ్ధికురాలు కోలుకుంది. 106 ఏళ్ల మహిళ తన కుమారులు, కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి కింగ్ ఫైసల్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స పొందారు. 

తైఫ్‌కు దక్షిణంగా ఉన్న చారిత్రాత్మక గ్రామమైన బని సాద్‌కు చెందిన జెడారా తెగకు చెందిన ఈ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో 21 రోజులు పాటు అక్కడి మెడికల్ కాంప్లెక్స్‌ లో చికిత్స పొందింది. ఆ తరువాత పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలడంతో ఆమెను డిశ్చార్జి చేశారు. 

ఆమెతో పాటు ఆమె 70 ఏండ్ల కుమారుడు, 60 ఏండ్ల కుమార్తె కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు. వారితో పాటు ఆమె ఇతర పిల్లలు, మనుమరాళ్లు కరోనా వ్యాధి బారిన పడ్డారు. వారు కొంతమంది వ్యాధి నుంచి కోలుకోగా మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. తైఫ్ కమిషనరేట్‌లో కరోనా నుంచి కోలుకున్న మొదటి 106 ఏండ్ల వృద్ధురాలిగా ఈమె నిలిచింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo