ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 09:32:29

అమెరికాలో కొత్తగా 99వేల కరోనా కేసులు

అమెరికాలో కొత్తగా 99వేల కరోనా కేసులు

వాషింగ్టన్ : గత 24 గంటల్లో యునైటెడ్‌ స్టేట్స్‌లో 99వేలకుపైగా కొవిడ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది రోజువారి కొత్త రికార్డు అని జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. మంగళవారం రాత్రి 8.30గంటల నుంచి బుధవారం వరకు 99,660 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,112 మరణాలు సంభవించాయి. బాల్టిమోర్‌ స్కూల్‌ లెక్కల ప్రకారం.. మహమ్మారి సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒక రోజు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 9.4 మిలియన్లకుపైగా జనం వైరస్‌ బారినపడ్డారు. 2.33లక్షల మంది మృత్యువాతపడ్డారు. అక్టోబర్‌ మధ్య నుంచి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర, మిడ్‌వెస్ట్‌లో కేసులు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి.

శీతాకాలం కరోనా కేసులు మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను మహమ్మారి దెబ్బతీసింది. వృద్ధితో పాటు పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే యూఎస్‌ ఎన్నికలను సైతం ప్రభావితం చేసింది. వంద మిలియన్ల మంది ఓటర్లు మంగళవారం ఎన్నికల ఒక రోజు ముందు మెయిల్‌ ద్వారా, వ్యక్తిగతంగా తమ ఓటు వేశారు. అధిక సంఖ్యలో మెయిల్-ఇన్ బ్యాలెట్ల సంఖ్య కొంత ఆలస్యం కావడంతో చాలా మంది అమెరికన్లు రద్దీగా ఉండే పోలింగ్ బూత్‌లను నివారించడానికి ప్రయత్నించారు.