బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 18:31:42

ఒకే ఆరోగ్య కేంద్రంలో 98 మంది వృద్ధులు మృతి

ఒకే ఆరోగ్య కేంద్రంలో 98 మంది వృద్ధులు మృతి

హైదరాబాద్: న్యూయార్క్‌లో ఒకేఒక్క ఆరోగ్యకేంద్రానికి చెందిన 98 మంది మరణించినట్టు లెక్కతేలడంతో అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెన్‌హాటన్‌లోని ఇసాబెల్లా గెరియాట్రిక్ సెంటర్‌‌లో కరోనా మృత్యు బీభత్సాన్ని సృష్టించింది. వృద్ధుల కోసం ఉద్దేశించిన ఆ ఆరోగ్య కేంద్రంలో 705 పడకలుండగా 46 మంది ప్రత్యక్షంగా కరోనా వాతపడ్డారు. మరో 52 మంది కరోనా లక్షణాలతో మరణించారు. 'ఇది చాలా దారుణం.. ఒకే ఆరోగ్య కేంద్రంలో అంతమంది మరణించడం ఊహించరాని విషయం' అని మేయర్ బిల్ డిబ్లాజియో అన్నారు. రోజురోజుకూ మృతదేహాలు పోగుపడుతున్నాయి. అంత్యక్రియల కేంద్రాలు పెద్ద సంఖ్యలో మృతదేహాలను స్వీకరించేందుకు అంగీకరించకపోవడంతో ఆరోగ్యకేంద్రం అధికారులు రిఫ్రిజిరేటర్ ట్రక్కులను పిలిపిస్తున్నారు. కంటేనర్ లారీల్లాంటి ఆ ట్రక్కులను శీతలీకరించి మృతదేహాలను నిల్వచేస్తారు. అవి సంచార శవాగారంలా పని చేస్తాయి. ఇతర కేంద్రాల్లాగే ఇసాబెల్లాలోనూ పెద్దగా వైరస్ పరీక్షా సదుపాయాలు లేవు. దాంతో ఇన్పెక్షన్‌కు గురై జబ్బు పడినవారిని, లక్షణాలు బయటపడకుండా వైరస్‌కు గురైనవారిని సత్వరమే గుర్తించడం వీలుపడలేదని ఆరోగ్యకేంద్రం అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు పరీక్షా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ జరగాల్నిన నష్టం జరిగిపోయింది.


logo