యంగ్ హీరో సుధీర్ బాబు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ప్రస్తుతం ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, ఇవి ప్రేక్షకులని అలరించాయి.
ఇక ఈ రోజు సుధీర్ బాబు బర్త్డే సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు అదరగొట్టాడు. సన్నివేశాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో సుధీర్ తప్పక హిట్ కొడతాడని అంటున్నారు.