శనివారం 16 జనవరి 2021
International - Dec 20, 2020 , 15:43:07

ఈ కుర్రాడు యూట్యూబ్‌లో ఆడుకుంటూ సంపాదిస్తున్నాడు..!

ఈ కుర్రాడు యూట్యూబ్‌లో ఆడుకుంటూ సంపాదిస్తున్నాడు..!

టెక్సాస్‌: తొమ్మిదేళ్లకు మనమందరం ఏం చేశాం. స్కూల్‌కి వెళ్లడం.. బొమ్మలతో ఆడుకోవడం.. అంతేగా..కానీ అమెరికాకు చెందిన కుర్రాడు కూడా అందరిలానే ఆడుకుంటున్నాడు. కానీ ఏడాదికి మిలియన్‌ డాలర్లు సంపాదిస్తున్నాడు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అతడు ఆడుకునేది యూట్యూబ్‌లో.. అతడు ఆడుకోవడంతోపాటు బొమ్మలపై సమీక్ష చేస్తున్నాడు. దీంతో అతడి వీడియోల వ్యూయర్స్‌ సంఖ్య పెరిగిపోయింది. ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా అత్యధికంగా సంపాదించిన యూట్యూబర్‌గా రికార్డు సాధించాడు. 

టెక్సాస్‌కు చెందిన లిటిల్‌ ర్యాన్‌కాజీకి తొమ్మిదేళ్లు. అతడికి ‘ర్యాన్స్‌ వరల్డ్‌’అనే యూట్యూబ్‌ చానల్‌ ఉంది. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూ వాటిపై సమీక్ష చేస్తాడు. అతని చానల్‌కు  27 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 2018లో అతడు యూట్యూబ్‌ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా..2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించి వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్‌గా నిలిచాడు ర్యాన్‌కాజీ.  అలాగే, మిలియన్ డాలర్ల విలువైన నికెలోడియన్‌లో ఒక టీవీ సిరీస్ కోసం అతడు ఒక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. అంతేకాదు.. ర్యాన్‌కాజీతోపాటు అతడి తల్లిదండ్రులకు మొత్తం తొమ్మిది యూట్యూబ్‌ చానల్స్‌ ఉండగా.. అన్నింటికీ మిలియన్ల వ్యూస్‌ వస్తున్నాయట.

ఇవి కూడా చదవండి..

ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌డాగ్ ట్రాలీ ఏదో తెలుసా?

1,731 గ్రాముల చంద్రుడి మట్టి

అలర్జీ రోగులు తస్మాత్‌ జాగ్రత్త: యూఎస్‌ఎఫ్‌డీఏ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.