శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 28, 2020 , 01:38:04

9 ఏండ్ల బాలుడి సంపాదన ఏడాదికి 220 కోట్లు!

9 ఏండ్ల బాలుడి సంపాదన ఏడాదికి 220 కోట్లు!

వాషింగ్టన్‌: చదివేది మూడో తరగతి. వయస్సు 9 ఏండ్లు. సంపాదన ఏడాదికి రూ. 220 కోట్లు. యూట్యూబ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నవారి జాబితాలో మొదటిస్థానం. అదికూడా ఒక్కసారి కాదు. వరుసగా మూడేండ్లు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన చిచ్చర పిడుగు ర్యాన్‌ కాజీ గురించిన ఉపోద్ఘాతమిది. 2020లో యూట్యూబ్‌ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించిన టాప్‌-10 యూట్యూబ్‌ స్టార్ల లిస్టును ఫోర్బ్స్‌ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇందులో ర్యాన్‌ కాజీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వరుసగా మూడేండ్లుగా టాప్‌ స్థానంలోనే ఉంటున్నాడు. ర్యాన్‌ చిన్న పిల్లలు ఆడుకొనే బొమ్మలపై రివ్యూ చేస్తూ వీడియోలు రూపొందిస్తాడు. తన యూట్యూబ్‌ చానల్‌ పేరు ర్యాన్స్‌ వరల్డ్‌. ఈ చానల్‌కు దాదాపు 3కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.