శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 12:38:46

ఆఫ్ఘాన్‌పై పాక్‌ సైన్యం రాకెట్‌ దాడి.. 9 మంది మృతి

ఆఫ్ఘాన్‌పై పాక్‌ సైన్యం రాకెట్‌ దాడి.. 9 మంది మృతి

కాబూన్‌ : జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్‌ రాకెట్‌ దాడులు చేసింది అని ఆఫ్ఘాన్‌ ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థ ప్రకారం పాకిస్తాన్ సైన్యం కందహార్ స్పిన్ బోల్డాక్ జిల్లాలోని జనాభా ప్రాంతంలో రాకెట్లను పేల్చింది. ఈ దాడిలో 9 మంది సాధారణ పౌరులు మరణించగా 50 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు.

పాకిస్తాన్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆఫ్ఘన్ దళాలు సిద్ధంగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశంలోని అన్ని సైనిక దళాలు, ముఖ్యంగా 205 అటల్, 201 సలాబ్, 203 థండర్ క్యాంపులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ సాయుధ దళాల అధిపతి జనరల్ మహ్మద్ యాసిన్ జియా లెవి చెప్పారు. దీంతో ఆఫ్ఘన్ దళాలు భారీ ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి. 

మొహమ్మద్ యాసిన్ జియా నేతృత్వంలోని వైమానిక దళం, ప్రత్యేక దళాలను తీవ్ర హెచ్చరికలో ఉంచారని, పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘన్ భూభాగంలో తన రాకెట్ లాంచర్లను కొనసాగిస్తే ఆఫ్ఘన్ మిలిటరీ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo