సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 13:15:05

సాయుధ బలగాల దాడిలో 9 మంది మృతి

సాయుధ బలగాల దాడిలో 9 మంది మృతి

నరినో : పశ్చిమ కొలంబియన్ ప్రావిన్స్ నరినోలో సాయుధ బలగాల దాడిలో తొమ్మిది మంది మరణించినట్లు ఆ ప్రావిన్షియల్ గవర్నర్‌ జాన్‌ రోజస్ ఆదివారం తెలిపారు.  సమానిగో మున్సిపాలిటీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సాయుధ బలగాలు జరిపిన దాడిలో తొమ్మిది మంది మృతి చెందారని, మరికొందరికి గాయాలయ్యాయని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. గత రెండు నెలలుగా సమానిగోలో 20 మందికిపై సాయుధ బలగాల దాడిలో హత్యమయ్యారని గవర్నర్ వెల్లడించారు. నరియోలో సాయుధ బలగాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రావిన్స్‌లో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన పిలుపునిచ్చారు.


logo